దేశీ టెస్టింగ్‌ పరికరం లాంఛ్‌

Union Minister Dedicated The COBAS Testing Machine To The Nation - Sakshi

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కోబాస్‌ 6800

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది.  వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్‌ 6800 టెస్టింగ్‌ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్‌-19 టెస్ట్‌ల కోసం దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్‌ పరికరాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌లో ఏర్పాటు చేశారు. మరోవైపు పీపీఈ కిట్లను దేశీయంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత వాయుసేన ఆధ్వర్యంలో భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్‌ సహకారంతో పేటెంట్‌కు దరఖాస్తు చేశారు.


 


 


 


చదవండి : ఫాసీ వ్యాఖ్యలతో ఏకీభవించను: ట్రంప్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top