భర్త మరణ వార్తనే చదవాల్సి వచ్చింది | Unexpected situation to the news reader | Sakshi
Sakshi News home page

భర్త మరణ వార్తనే చదవాల్సి వచ్చింది

Apr 9 2017 8:14 AM | Updated on Oct 17 2018 4:53 PM

భర్త మరణ వార్తనే చదవాల్సి వచ్చింది - Sakshi

భర్త మరణ వార్తనే చదవాల్సి వచ్చింది

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుప్రీత్‌ కౌర్‌ (28) అనే న్యూస్‌ రీడర్‌ వార్తలు చదువుతోంది.

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుప్రీత్‌ కౌర్‌ (28) అనే న్యూస్‌ రీడర్‌ వార్తలు చదువుతోంది. బులెటిన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి వచ్చింది. మరిన్ని వివరాల కోసం స్థానిక విలేకరిని సంప్రదించింది. మహాసముండ్‌ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారని అతను చెప్పినా, ఆ సమయంలో వారి పేర్లు వెల్లడించలేకపోయాడు.

అయితే, విలేకరి చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తన భర్త కూడా ఉన్నాడని, తన భర్త మరణ వార్తనే ప్రత్యక్షప్రసారంలో చదివానని కొద్దిక్షణాల్లో ఆమె గ్రహించింది. వెంటనే సంభాలించుకుని బులెటిన్‌ను కొనసాగించినా, కెమెరా ఆపేయగానే బోరున విలపించింది. శనివారం ఉదయం ఐబీసీ24 చానెల్‌లో ఇది ప్రసారమైంది. ఈ ఘటన సంస్థ కార్యాలయంలో పలువురిని కలచివేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement