ఉద్ధవ్‌ ఠాక్రే... మీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది

Uddhav Thackeray Posts IPhone Photos On Instagram - Sakshi

ముంబయి : ఈ మధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. అవి ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిభింబిస్తూనే ఆయనలో మరో కోణం ఉందనే అభిప్రాయాన్ని కలిగించేలా ఆ చిత్రాలు ఉండడం విశేషం. ఉదయిస్తున్న సూర్యుడి వెలుగులో పూలతో నిండిన తోట, రణతంబోర్‌ టైగర్‌, కెనెడాకు చెందిన పొలార్‌ ఎలుగుబంటి లాంటివి ఆయన తీసిన వాటిలో ఉన్నాయి. ఈ ఫోటోలకు ' ఐఫోన్‌ షాట్‌' అనే క్యాప్షన్‌ జత చేశారు.


iPhone shot

A post shared by @ uddhavthackeray on

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో చాలా మందిని ఆకర్షించాయి. అంతేకాదు పోస్ట్ చేసిన ఒక రోజు వ్యవధిలోనే 15 వేలకు పైగా లైక్స్‌ వచ్చి చేరాయి. ' మీ ఐఫోన్‌తో తీసిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఉదయిస్తున్న సూర్యుడి ప్రతిబింబం మీ చిత్రానికి అందాన్నిస్తుంది' అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. ' మీ ఫోటో క్లిక్‌ బాగుంది. ఫ్రేమ్‌ సెలక‌్షన్‌ ఇంకా బాగుంది' అంటూ పలువురు పేర్కొన్నారు. వైల్డ్‌లైప్‌ ఫొటోగ్రఫీ తన అభిరుచి అని ఉద్దవ్‌ ఇదివరకే స్పష్టం చేశారు.


Gir India

A post shared by @ uddhavthackeray on

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top