ఇద్దరు ఉగ్రవాదుల హతం

Two Terrorists Killed in Srinagar Encounter - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఎప్పుడూ సాధారణ ప్రజలను, భారత సైన్యాన్ని టార్గెట్‌ చేసే ఉగ్రవాదులు ఈ సారి ఏకంగా స్థానిక బీజేపీ నాయకుడు మహ్మద్‌ అన్వర్‌పైకి కాల్పులకు తెగపడ్డారు. బారాముల్లాలోని ఖాన్మోహ్‌లో జరిగిన ఈ ఘటనలో రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. కాగా అన్వర్‌పైకి కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది వేగంగా స్పందించడంతో సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య బీకర కాల్పులు జరిగాయి.  కాల్పుల్లో అన్వర్‌, అతని సెక్యూరిటి స్వల్ప గాయలతో బయటపడగా, రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.

ఎన్‌కౌంటర్‌ ముగిసిన అనంతరం ఉగ్రవాదుల మృతదేహాలను, వారి వద్దనున్న ఆయుధాలను, పేలుడు సామాగ్రీని అధికారులు స్వాధీనపరుచునున్నారు. బారాముల్లా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో శుక్రవారం బారాముల్లా- బన్నిహాల్‌ మధ్య  రైల్వే సేవలను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థానిక గ్రామంలో నాలుగు ఇళ్లు  ధ్వంసంకాగా , ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top