జార్ఖండ్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈసారి ఎన్నికల్లో అసలు గెలిచే లక్షణాలే కనిపించడంలేదు.
జార్ఖండ్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈసారి ఎన్నికల్లో అసలు గెలిచే లక్షణాలే కనిపించడంలేదు. మాఝ్గావ్ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి మధుకోడా మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో వెనకబడి ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కూడా ధాన్వాడ్ స్థానంలో వెనకబడే ఉన్నారు. దాంతో వీళ్లిద్దరూ గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇంకో మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ మాత్రం ముందంజలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాలు చూస్తే, జార్ఖండ్లోని మొత్తం 81 స్థానాలకు గాను 41 చోట్ల ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో 29 చోట్ల బీజేపీ, 9 చోట్ల జేఎంఎం, 2 చోట్ల కాంగ్రెస్, 1 చోట జేవీఎం ఆధిక్యంలో ఉన్నాయి.
జమ్ము కశ్మీర్ రాష్ట్రం చూస్తే.. అక్కడున్న మొత్తం 87 స్థానాలకు గాను 73 చోట్ల ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వాటిలో 31 చోట్ల పీడీపీ, 18 చోట్ల బీజేపీ, 14 చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్, 8 చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉండగా మూడు చోట్ల ఇతరులు ముందున్నారు.