త్వరలో మళ్లీ ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు | Trump Tower Mumbai Sales to Resume | Sakshi
Sakshi News home page

త్వరలో మళ్లీ ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు

Apr 25 2017 11:23 AM | Updated on Sep 5 2017 9:40 AM

త్వరలో మళ్లీ ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు

త్వరలో మళ్లీ ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు

ముంబయిలోని ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 2019నాటికి టవర్‌ మొత్తాన్ని విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ సంస్థ లోధా గ్రూప్‌ ప్రకటించింది.

ముంబయి: ముంబయిలోని ట్రంప్‌ టవర్‌ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 2019నాటికి టవర్‌ మొత్తాన్ని విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ సంస్థ లోధా గ్రూప్‌ ప్రకటించింది. సౌకర్యవంతమైన విల్లాల విక్రయ మార్కెట్లో లోధా గ్రూప్‌ ముందుంటుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో టవర్‌ అమ్మకాలను ఆపివేశారు.

మొత్తం 75 అంతస్థుల ఈ భవనంలో 60శాతం ఇప్పటికే విక్రయించామని, మిగితా మొత్తాన్ని 2019నాటికి పూర్తి స్థాయిలో విక్రచయించాలనుకుంటున్నట్లు లోధా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ లోధా చెప్పారు. ‘ట్రంప్‌ విజయం సాధించిన వెంటనే ట్రంప్‌ టవర్‌ మొత్తాన్ని విక్రయించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజకీయ పరమైన మార్పుల దృష్ట్యా ఇది ఎలాంటి సంకేతాన్నైనా ఇవ్వొచ్చు అని ఆపేశాం’ అని ఆయన చెప్పారు. జూన్‌ లేదా జూలై నెలలో విక్రయాలు జరపాలని అనుకుంటున్నామని, అప్పుడే తగిన సమయం అని తాము భావిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement