వాజ్‌పేయి ఇకలేరు.. గవర్నర్‌ షాకింగ్‌ ట్వీట్‌

Tripura Governor Tathagata Roy announces Vajpayee Is Dead - Sakshi

వెంటేనే తొలగించి క్షమాపణ చెప్పిన  తథాగత రాయ్

సాక్షి, న్యూఢిల్లీ :  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి(93) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఎయిమ్స్‌లోవెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ వివాదస్పద ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఇక లేరంటూ ఆయన చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ట్వీట్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ గా మారి.. విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించి పొరపాటు జరిగిందని క్షమాపణలు  కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top