70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Total Corona Positive Cases In Country Is Now at 70756 - Sakshi

ఆంక్షలు సడలించిన తర్వాత పెరుగుతున్న కేసులు

సాక్షి, న్కూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్‌ కేసులతో పాటు 87 మంది బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22454 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. (వైద్యుడి సాహసంపై ప్రశంసల జల్లు)

రాష్ట్రాల వారిగా..

  • మహారాష్ట్రలో 23,401 పాజిటివ్ కేసులు, 868 మంది మృతి
  • గుజరాత్‌లో 8,542 పాజిటివ్ కేసులు, 513 మంది మృతి
  • తమిళనాడులో 8,002 పాజిటివ్ కేసులు, 53 మంది మృతి
  • ఢిల్లీలో 7,233 పాజిటివ్ కేసులు, 73 మంది మృతి
  • రాజస్తాన్‌లో 3,988 పాజిటివ్ కేసులు, 113 మంది మృతి
  • మధ్యప్రదేశ్‌లో 3,785 పాజిటివ్ కేసులు, 221 మంది మృతి
  • ఉత్తరప్రదేశ్‌లో 3,573 పాజిటివ్ కేసులు, 80 మంది మృతి
  • పశ్చిమబెంగాల్‌లో 2,063 పాజిటివ్ కేసులు, 190 మంది మృతి
  • పంజాబ్‌లో 1,877 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి 
  • జమ్మూకశ్మీర్‌లో 879 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి
  • కర్ణాటకలో 862 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి
  • హర్యానాలో 730 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top