కరోనా : వైద్యుడి సాహసంపై ప్రశంసల జల్లు

AIIMS doctor takes off safety gear to help coronavirus COVID-19 patient - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమను తాము రక్షించుకోవడమే సవాలుగా మారిన ప్రస్తుత కరోనా కాలంలో ఓ వైద్యుడు చేసిన సాహసం అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. తన ప్రాణాలను పణంగా పెట్టి.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి ప్రాణ వాయువును అందించారు. ఢిల్లీలో ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి చెందిన జహీద్‌ అబ్దుల్‌ మజీద్‌ అనే వైద్యుడు ట్రామా సెంటర్‌లో విధులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో తన వ్యక్తిగత భద్రతను పూర్తిగా తొలగించారు. (కరోనా: ఒక్కడి ద్వారా 20 మందికి..!)

వివరాల ప్రకారం.. కరోనాతో బాధపడుతున్న ఓ రోగిని ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అంబులెన్స్‌లో రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీనికి గమనించిన మసీద్‌.. రోగికి శ్వాస అందడం కోసం గొంతులో వేసిన గొట్టం బయటకు వచ్చినట్లు గుర్తించారు. పక్కనున్న వైద్యులకు సమాచారం అందించగా.. బాధితుడు కరోనా రోగి కావడంతో అతన్ని ముట్టుకునేందుకు ఎవరూ  సాహసం చేయలేకపోయారు. మసీద్‌ పీపీఈ (మాస్క్‌, కళ్ల అద్దాలు, ముఖ కవచం) వంటి భద్రతను కలిగి ఉండటంతో అతనికి సహాయం చేయడానికి ఇబ్బందిగా మారింది. (లాక్‌డౌన్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు!)

ఇంతలోనే శ్వాస అందక రోగి పరిస్థితి విషయంగా మారుతుండటంతో మసీద్‌ చలించిపోయారు. రోగి నుంచి భారీగా వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉందని తెలిసినా ఏమాత్రం బయపడలేదు. పీపీఈ కిట్‌ను పూర్తిగా తొలిగించి శ్వాస అందించే గొట్టాన్ని సరిచేసి అతనికి ప్రాణం పోశారు. అనంతరం వైద్యుల సూచనమేరకు 14 రోజుల పాటు క్వారెంటైన్‌కు వెళ్లారు. పరీక్షల్లోనూ అతనికి కరోనా నెగటివ్‌గా వచ్చింది. మసీదు  సాహసంపై ఎయిమ్స్‌ వైద్యులతో పాటు సోషల్‌ మీడియాలో సైతం ప్రశంసలు అందుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top