పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి | to solve bc demands parties will come to single decision, says venkaiah | Sakshi
Sakshi News home page

పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి

May 8 2015 2:24 AM | Updated on Aug 15 2018 6:34 PM

పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి - Sakshi

పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి

బీసీల డిమాండ్లపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం రావాలని, ఆ తర్వాతే ప్రభుత్వం పరిష్కారం దిశగా ముందుకు వెళుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

బీసీల డిమాండ్ల పరిష్కారంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీల డిమాండ్లపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం రావాలని, ఆ తర్వాతే ప్రభుత్వం పరిష్కారం దిశగా ముందుకు వెళుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు వెంకయ్యనాయుడును కలసి బీసీల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో 50 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల ప్రత్కేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి కృష్ణయ్య అలుపెరుగని కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
 
 డిమాండ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసని శంకర్‌రావు, గుజ్జ కృష్ణ, రమేశ్, దుర్గయ్య గౌడ్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బీసీ, ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. అలాగే ఓబీసీ మహాజన్ ఫ్రంట్‌తో కలిసి ఓబీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆర్.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఆల్‌మెన్‌రాజు ప్రకటించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిల భారత ఓబీసీ మహాజన్ ఫ్రంట్ సమావేశం రానున్న దశాబ్ది కాలాన్ని ‘ఓబీసీ దశాబ్ది 2015-2024’ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, అలీ అన్వర్, రాజేశ్ వర్మ, మాజీ కేంద్ర మంత్రి నిషాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement