టిక్‌టాక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

TikTok Film Festival is Happening in Pune  - Sakshi

ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చూశాం. కానీ ఎక్కడైనా టిక్‌టాక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను చూశారా అంటే ఇప్పటి వరకు చూడలేదనే సమాధానమే వినిపిస్తుంది. కానీ ఇప్పడు కళ్లారా చూడబోతున్నాం. నమ్మట్లేదా! నిజమేనండి.   చైనా  సామాజిక మాధ్యమమైన టిక్‌టాక్‌లో పెట్టే వీడియోలలో బెస్ట్‌ను సెలెక్ట్‌ చేసి వారికి అవార్డులు ఇస్తాం అంటూ పూణేకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రకటించారు. దీంతో పూణే టిక్‌టాక్‌ ఫెస్టివల్‌కు మొదటి కేంద్రం అయింది. ఇందులో మొత్తం 12 కేటగిరీలుగా విభజించి విజేతలను ప్రకటిస్తామన్నారు. సామాజిక బాధ్యత, భావోద్యోగం, హాస్యం, ప్రేమ జంటలకు ప్రాధాన్యం ఇస్తామని వీరు తెలిపారు.

మొదటి బహుమతిగా రూ.33,333, రెండవ బహుమతిగా రూ.22,222 అలాగే 3,4,5 బహుమతులు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన ప్రకాశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘ టిక్‌టాక్‌ ఇప్పుడు ట్రెండింగ్​ అని, ఇది రాత్రికి రాత్రి ఎంతో మందిని స్టార్లను చేసిందని తెలిపారు. చాలామంది ప్రతిభ టిక్‌టాక్‌ ద్వారా వెలుగులోకి వచ్చిందని, వారికోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకొనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.  ఆగస్టు 20న ఎంపిక అయిపోతుందని, ఆ తర్వాత విజేతలను నిర్ణయిస్తామన్నారు. కాగా సామాన్యుడిలోని ప్రతిభ వెలికితీతకు స్వయం వేదికగా మొదట్లో పేరుతెచ్చుకున్న టిక్‌టాక్‌ వీడియోలు తర్వాత శృతిమించి పలువురి మరణానికి కారణం అయ్యాయి. దీంతో టిక్‌టాక్‌ను నిషేదించాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయంటే ఇవి ఎంత ప్రమాదకరంగా మారాయో తెలుస్తుంది. వీటిలో వీడియోలు పోస్టు చేయడం సులభంగా ఉండటంతో ప్రజలకు కనెక్ట్‌ అయింది. ఇప్పుడు ఈ ఫెస్టివల్‌ నిర్వహణ విజయవంతం అయితే మరెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top