'వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు' | Those On Bail Are Not Olympic Heroes, Says Anupam Kher At JNU | Sakshi
Sakshi News home page

'వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు'

Mar 18 2016 8:08 PM | Updated on Sep 3 2017 8:04 PM

'వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు'

'వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు'

బెయిల్ పొందిన విద్యార్ధులను సాదరంగా స్వాగతించడానికి వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు అని..

న్యూ ఢిల్లీ: జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉగ్రవాది అప్జల్ గురుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టైన ఉమర్ ఖలీద్, అనిర్భన్ బట్టాచార్యలకు కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. యూనిటీ మార్చ్ పేరుతో బెయిల్పై విడుదలౌతున్న వీరికి స్వాగతం పలకాలని కన్నయ్య కుమార్తో సహా పలువురు మద్దతుదారులు జేఎన్యూలో సన్నాహకాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. బెయిల్ పొందిన విద్యార్ధులను సాదరంగా స్వాగతించడానికి వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు అని వ్యాఖ్యానించారు. జేఎన్యూలో శుక్రవారం అనుపమ్ ఖేర్ చిత్రం 'బుద్ద స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్'ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులను ఉద్దేశించి అనుపమ్ ప్రసంగించారు. తన చిత్రాన్ని ప్రదర్శించడానికి యూనివర్సిటీ అధికారులు మొదట అభ్యంతరం చెప్పారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement