'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి' | The Minister on whose advice the decision to impose President rule must be sacked | Sakshi
Sakshi News home page

'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'

May 11 2016 6:48 PM | Updated on Sep 3 2017 11:53 PM

'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'

'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'

ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన మంత్రిని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో  క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు.

'కాంగ్రెస్ రాజకీయ  బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement