విదేశీ మారక అక్రమాలపై ఈడీ దర్యాప్తు | The ED is investigating the illegality of foreign exchange | Sakshi
Sakshi News home page

విదేశీ మారక అక్రమాలపై ఈడీ దర్యాప్తు

Sep 15 2014 1:22 AM | Updated on Sep 2 2017 1:22 PM

విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్‌బీఐ, ....

‘నల్లధన’ సిట్ విజ్ఞప్తి
 
న్యూఢిల్లీ: విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోరింది.   రూ. 100 కోట్లకుపైగా ఎగుమతి బకాయిల వివరాలను ఈడీకి అందజేసింది.

సాధారణంగా బ్యాంకులు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, కస్టమ్స్ సంస్థలకే ఇచ్చేవి. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే వారు తమకు రావలసిన బకాయిల సమాచారాన్ని 9 నెలల్లోగా ఆర్‌బీఐకి ఇవ్వాలి. లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తారు. వీటిని విదేశీ మారకం నిబంధనల ఉల్లంఘన, హవాలా కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు సిట్  గుర్తించింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement