అమర్‌నాథ్‌ యాత్రలో అపశ్రుతి | Telugu People Died in Amarnath Yatra | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్రలో అపశ్రుతి

Jul 8 2018 4:09 PM | Updated on Sep 2 2018 4:52 PM

Telugu People Died in Amarnath Yatra - Sakshi

సాక్షి, జమ్మూకాశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీంద్రనాథ్‌ చౌదరి అనే వ్యక్తి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందారు. రవీంద్ర ఈ నెల 3న అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి శ్రీనగర్‌లోని షేర్-ఈ-కాశ్మీర్ హాస్పిటల్‌లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటిలేటర్‌ తీయడానికి వీలు లేకపోవడంతో అతని కోసం ఎయిర్‌ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ లోపే బ్రెయిన్‌ స్టోక్‌తో ఆదివారం మధ్యాహ్నం రవీంద్రనాథ్‌ మరణించారు. రేపు సాయంత్రం మృతదేహాన్ని వైజాగ్‌కు తరలించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్‌ ప్రత్యేక కమీషనర్‌ అర్జా శ్రీకాంత్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement