పంజాబ్లోని అమృతసర్లో 17 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
పంజాబ్లోని అమృతసర్లో 17 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు అమృతసర్లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంటుంది.
తాను నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పార్లర్కు బయలుదేరిన సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి, తన ఇంటి ముందు నుంచే అపహరించుకుపోయారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చి వైద్యపరీక్షలు చేయించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం నిజమేనని వైద్య పరీక్షలలో కూడా తేలింది. అయితే, ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు.