అర్చకులైన అధ్యాపకులు

teachers turn priests at temples in Bilaspur - Sakshi
  • ప్రమోద్‌ కుమార్‌ : ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడు
  •  ప్రస్తుతం : శ్రీ మహాకపాలేశ్వర్‌ ఆలయంలో అర్చకుడు
  • సంజీవ్‌ కుమార్‌ : ప్రభుత్వ పాఠశాలలో క్రీడాపాధ్యాయుడు
  •  ప్రస్తుతం : శివాలయంలో అర్చకుడు
  • జై కిషన్‌ : ప్రభుత్వ పాఠశాల ప్రధానోధ్యాపకుడు,
  • ప్రస్తుతం : సఫేద్‌ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు
  • మోహన్‌ లాల్‌ : ప్రభుత్వ పాఠశాలలో హిందీ అధ్యాపకుడు
  •  ప్రస్తుతం : సఫేద్‌ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు

బిలాస్‌ పూర్‌ : వీళ్లేకాదు.. మరో 91 మంది టీచర్లు.. బిలాస్‌పూర్‌లోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. హరియాణాలో పవిత్ర రోజులుగా పేర్కొనే కపాల్‌ మోచన్‌ మేళ సందర్భంగా వివిధ ఆలయాల్లో టీచర్లు అర్చకులుగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేంది. అం‍దుకు అనుగుణంగా ప్రభుత్వ టీచర్లకు గత నెల 29న అర్చకత్వంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.

టీచర్లను ఇలా ఇతర కార్యక్రమాలకు వినియోగంచడంపై ప్రభుత్వ టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్లను వేరే కార్యక్రమాలకు వినియోగించడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని ఇతర అధ్యాపకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధ్యాపకులను ఇతర కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారంటూ.. విద్యాశాఖాధికారులకు జిల్లా మెజిస్ట్రేట్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖాధికారులు.. ఇటువంటి పర్వదినాల్లో భక్తులకు అవసరమైన సేవలు అందించాలంటే అర్చకలు సరిపొవడం లేదని.. కేవలం ఆరు రోజులు మాత్రమే ఇలా వినియోగించడం జరగుతుందని వివరణ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top