తోటి టీచర్ ను కాల్చేసిన ఉపాధ్యాయుడు | Teacher shoots colleague | Sakshi
Sakshi News home page

తోటి టీచర్ ను కాల్చేసిన ఉపాధ్యాయుడు

Apr 26 2014 4:56 PM | Updated on Sep 2 2017 6:33 AM

జార్ఖండ్ లో ఇద్దరు టీచర్ల మధ్య మాటా మాటా పెరిగి, ఒక టీచర్ ఇంకో టీచర్ ను కాల్చేశాడు.

జార్ఖండ్ లో ఇద్దరు టీచర్ల మధ్య మాటా మాటా పెరిగి, ఒక టీచర్ ఇంకో టీచర్ ను కాల్చేశాడు. ఈ సంచలన ఘటన రామ్ గఢ్ ప్రాంతంలో జరిగింది. రాజేశ్ గుప్తా, శ్రీకాంత్ శర్మ అనే టీచర్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరుగుతూండగానే పట్టరాని కోపంతో శర్మ గుప్త కణతపై తుపాకి గురిపెట్టి కాల్చేశాడు. 
 
ప్రస్తుతం గుప్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శర్మ పారిపోయాడు. ఇదే గ్రామంలో ఇంకో సంఘటనలో క్లాసులో నవ్వినందుకు ఓ విద్యార్థి చేయి విరగ్గొట్టాడు ఒక ఉపాధ్యాయుడు. ఆ విద్యార్ధి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. టీచర్ పారిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement