'మీ రొమాన్స్‌తో కష్టం.. మీరొద్దు.. పెళ్లి రోజే షాక్‌'

Teacher Couple Sacked on Wedding Day - Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను వారి పెళ్లి రోజే ఆ స్కూల్‌ యాజమాన్యం అనూహ్యంగా తొలగించి షాకిచ్చింది. వాళ్ల రొమాన్స్‌ స్కూల్‌ విద్యార్థులకు ఇబ్బందిని కలిగిస్తుందని ఆ కారణంతోనే వారిని తొలగిస్తున్నామంటూ పేర్కొంది. దీంతో కెరీర్‌ ప్రారంభం సమయంలో వారికి ఉద్యోగం లేకుండా పెళ్లి సంతోషం కూడా మిగలకుండా చేసిన ఆ స్కూల్‌ యాజమాన్యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే తారిఖ్‌ భట్‌, సుమయా భషీర్‌ అనే ఇద్దరు పులువామా జిల్లాలోని ట్రాల్‌ టౌన్‌ ప్రాంత వాసులు వారిద్ద పాంపౌర్‌లోని ఓ ముస్లిం ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గత కొన్నేళ్లుగా టీచర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు వేర్వేరుగా బాయ్స్‌, గర్ల్స్‌ క్యాంపస్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వారిద్దరికి ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది. దాంతో వారిద్దరు కాస్త చనువుగా ఉండటం మొదలుపెట్టారు. గత నెల(నవంబర్‌) 30న వారి వివాహం ఉండగా అందుకోసం స్కూల్‌లో సెలవులకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, సెలవులు మాత్రం ఇచ్చిన స్కూల్‌ యాజమాన్యం సరిగ్గా పెళ్లి రోజు వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో వారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ సంతోషమే లేకుండా పోయింది. దీనిపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినప్పటికీ ఎలాంటి బదులు ఇవ్వలేదు. అయితే, స్కూల్‌ చైర్మన్‌ బషీర్‌ మసూది మాత్రం బదులిస్తూ 'వాళ్లిద్దరు రొమాన్సాలో ఉన్నారు. అది మా స్కూల్‌లో చదువుతున్న, పనిచేస్తున్న 2000మంది విద్యార్థులకు మంచిదికాదు. 200మంది స్టాఫ్‌కు మంచిది కాదు. వీరి మధ్య ఉన్న విషయం విద్యార్థులకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది' అని బదులిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top