19 ఏళ్ల తర్వాత సొంతగూటికి మాజీ ఎంపీ | Tariq Anwar Returns To Congress | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల తర్వాత సొంతగూటికి మాజీ ఎంపీ

Oct 27 2018 1:18 PM | Updated on Oct 27 2018 1:20 PM

Tariq Anwar Returns To Congress - Sakshi

రాహుల్‌ గాంధీతో తారిక్‌ అన్వర్‌ (కండువా వేసుకున్న వ్యక్తి)

విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీని వీడి శరద్‌ పవార్‌ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్‌ ఆయనకు అండగా నిలిచారు.

సాక్షి, న్యూఢిల్లీ : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తారిఖ్‌ అన్వర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో అభిప్రాయ భేదాలు నెలకొన్న నేపథ్యంలో సుమారు పందొమిదేళ్ల తర్వాత అన్వర్‌ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

కాగా విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీని వీడి శరద్‌ పవార్‌ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్‌ ఆయనకు అండగా నిలిచారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. తొమ్మిది పర్యాయాలు(లోక్‌సభ- ఐదుసార్లు, రాజ్యసభ- రెండుసార్లు) ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే రాఫెల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని సమర్థిస్తూ శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు చేయడంతో నెలరోజుల క్రితం ఆయన పార్టీని వీడారు.

Advertisement
 
Advertisement
Advertisement