టాప్‌–10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌ | Taj Mahal Top-10 magnificent monuments | Sakshi
Sakshi News home page

టాప్‌–10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌

May 26 2017 2:23 AM | Updated on Sep 5 2017 11:59 AM

టాప్‌–10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌

టాప్‌–10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌

ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ప్రముఖ ‘ట్రిప్‌ అడ్వైజర్‌’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది.

ముంబై: ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ప్రముఖ ‘ట్రిప్‌ అడ్వైజర్‌’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ‘ట్రావెలర్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌ ఫర్‌ ల్యాండ్‌మార్క్స్‌’ పేరిట ట్రిప్‌ అడ్వైజర్‌ ఈ జాబితాను విడుదల చేసింది.

కాంబోడియాలోని అంగ్‌ కోర్‌వాట్‌ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్‌ డీ కోర్డొబా, వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా నిలిచాయి. తర్వాత స్థానాల్లో రష్యాలోని ‘చర్చ్‌ ఆఫ్‌ ద సేవియర్‌ ఆన్‌ స్పిల్ల్‌డ్‌ బ్లడ్‌ (6), బీజింగ్‌లోని గ్రేట్‌వాల్‌ (7), పెరూలోని మచుపిచు (8) స్పెయిన్‌లోని ప్లాజా డీ ఎస్పనా (9), ఇటలీలోని డ్యుమో డీ మిలానో (10) నిలిచాయి. ఆసియా కట్టడాలతో విడుదల చేసిన మరో జాబితాలో తాజ్‌మహల్‌ రెండో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement