 
															సల్మాన్, కమల్, ప్రియాంకలకు మోడీ ఛాలెంజ్!
ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్కు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలబ్రెటీలకు సవాల్ విసిరారు.
	న్యూఢిల్లీ : ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్కు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు.  బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమందికి ఆహ్వానం పలికారు. . స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని  స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు.
	
	మోడీ ఆహ్వానం పలికినవారిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నాడు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
