చంద్రబాబును ఖాళీ చేయించేందుకు కోర్టుకెళ్లమన్న షిండే | Sushilkumar Shinde said Andhrapradesh should approach civil court over the site of Chandrababu Naidu fast | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఖాళీ చేయించేందుకు కోర్టుకెళ్లమన్న షిండే

Oct 10 2013 5:57 PM | Updated on Sep 1 2017 11:31 PM

చంద్రబాబును ఖాళీ చేయించేందుకు కోర్టుకెళ్లమన్న షిండే

చంద్రబాబును ఖాళీ చేయించేందుకు కోర్టుకెళ్లమన్న షిండే

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్‌లో అనుమతి లేకుండా నిరాహార దీక్ష కొనసాగించడంపై జోక్యం చేసుకునేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిరాకరించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్‌లో అనుమతి లేకుండా నిరాహార దీక్ష కొనసాగించడంపై జోక్యం చేసుకునేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిరాకరించారు. చంద్రబాబును ఖాళీ చేయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలని సూచించారు. కోర్టు ఆదేశాలిస్తే తాము సహకరిస్తామని షిండే చెప్పారు.

చంద్రబాబు వైఖరిని మాత్రం షిండే తప్పుపట్టారు. రాష్ట్ర అతిథి గృహంలో ఓ మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయడాన్ని తాను తొలిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన దీక్షను విరమించి స్వరాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. కాగా దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా,  దీక్ష విజయవంతవుయ్యేందుకు తమ వంతుగా సహకరిస్తున్నారు. ఏపీభవన్‌లోని సుమారు 40 గదులను చంద్రబాబు దీక్షకు వచ్చిన నేతలకే కేటాయించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement