నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్: రాజ్నాథ్ | surgical strike on corruption: Rajnath | Sakshi
Sakshi News home page

‘నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్’

Nov 10 2016 8:26 PM | Updated on Sep 4 2017 7:44 PM

దేశంలోని నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

బలియ: పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగానే దేశంలోని నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ బిలియ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్​నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో నల్లధనానికి శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు.
 
పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చెలామణి అవుతున్న నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడినట్లు అయిందన్నారు. కాగా రూ.500, 1000 నోట్లు రద్దు  వెనుక  నల్ల ధనాన్ని అరికట్టడమే కాకుండా, నకిలీ నోట్లు అన్నవి లేకుండా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ తయారు చేయడం దాదాపు అసాధ్యమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement