మమత సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

Supreme court warns West Bengal Government Counsel  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మమతా సర్కార్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను ఫార్వర్డ్‌ చేసిన ప్రియాంక శర్మ అరెస్ట్‌ ఏకపక్షమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమెను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, లేకుంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరికలు చేసింది. 

చదవండి: మమతకు కోపం వస్తే అంతేమరి!
క్షమాపణ లేకుండానే బెయిల్‌!

ప్రియాంక శర్మను విడుదల చేయాలని నిన్న (మంగళవారం) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సర్కార్‌ బేఖాతరు చేసింది. దీంతో ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా మమతపై అ‍భ్యంతరకర పోస్ట్‌ను ఫార్వర్డ్‌ చేసినందుకు ప్రియాంశ శర్మ బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని పశ్చిమ బెంగాల్‌ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆమెను ఇవాళ ఉదయం 9.40కి విడుదల చేసినట్లు ప్రభుత్వతరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రియాంకా శర్మను తక్షణమే ఎందుకు విడుదల చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top