ట్రిబ్యునల్స్‌పై నిబంధనల కొట్టివేత

సుప్రీంకోర్టు కీలక రూలింగ్
విస్తృత ధర్మాసనానికి నివేదన
కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌పై కేంద్రం రూపొందిం చిన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేంద్రానికి ఎదురుదెబ్బలాంటి ఈ తీర్పు వివరాల్లోకి వెళితే... జుడీషియల్ ట్రిబ్యునల్స్ కూర్పు, విధివిధానాలపై ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ మనీ బిల్లు కింద కేంద్రం కొన్ని కీలక నిబంధనలను తెచ్చింది. వివిధ ట్రిబ్యునళ్ల సభ్యుల నియామకాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన ఈ నిబంధనావళి పట్ల ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నియమాలను తోసిపుచ్చుతూ, వీటి అమలు ప్రభావాలను అధ్యయనం చేసి, అత్యున్నత న్యాయస్థానానికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మనీ బిల్లుగా ఫైనాన్స్ యాక్ట్ 2017 ఆమోదించడంలో చట్టబద్దతను పరిశీలించడానికి ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సైతం ఐదుగురు సభ్యుల ధర్మాసనం నివేదించింది. 2017 ఫైనాన్స్ చట్టం 184వ సెక్షన్ కింద ఈ నిబంధనలను కేంద్రం రూపొందించిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ, అయితే ఈ నియామకపు ప్రక్రియ ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాలకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి