కేంద్ర మాజీ మంత్రి సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులు ఆమె స్నేహితుడు, వ్యాపరవేత్త సునీల్ ట్రక్రును విచారించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులు ఆమె స్నేహితుడు, వ్యాపరవేత్త సునీల్ ట్రక్రును విచారించారు. సునంద హత్య జరగడానికి ముందు సునీల్ ఆమెను విమానాశ్రయం నుంచి దక్షిణ ఢిల్లీలోని హోటల్ వద్ద దింపారు. అదే హోటల్లో గతేడాది జనవరి 17న సునంద మరణించారు.
సునంద హత్య కేసుకు సంబంధించి శుక్రవారం సునీల్ను విచారించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద కేసులో పనిమనిషి నారాయణను సిట్ విచారించింది. నారాయణ్ ...సిట్ విచారణలో చెప్పిన వివరాల మేరకు సునీల్ను విచారించారు. ఈ కేసులో సునంద భర్త శశి థరూర్తో పాటు మరో 11 మందిని విచారించినున్నట్టు పో్లీసులు చెప్పారు.