సునంద పుష్కర్ మృతి కేసులో ప్రమేయంపై ఆమె తనయుడు శివ్ మీనన్‌ను పోలీసులు గురువారం ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రమేయంపై ఆమె తనయుడు శివ్ మీనన్‌ను పోలీసులు గురువారం ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న మీనన్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. సునంద మరణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పోలీసులు సునంద మృతి కేసులో 15మందిని విచారించారు. కాంగ్రెస్ ఎంపీ, ఆమె భర్త శశి థరూర్, ఆయన సిబ్బంది, సన్నిహితులు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్, సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్‌లతో పాటు పలువురిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే శివ్ మీనన్‌కు సమన్లు జారీ చేశారు.