మిస్‌ ఇండియా  2019 విజేతగా సుమన్‌ రావు

Suman Rao Won Femina Miss India 2019 - Sakshi

సాక్షి, ముంబయి : ఈ ఏడాది మిస్‌ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్‌ రావు (20)  కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారతదేశం తరపున మిస్‌ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్‌, సెకండ్‌ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ నిలిచారు. ఇక మిస్‌ ఇండియా యునైటడ్‌ కాంటినెంట్స్‌ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్‌ గెలుచుకున్నారు. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ఏడాది సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు... ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహుకరించింది. 

ఈ సందర్భంగా కిరీటం సొంతం చేసుకున్న సుమన్‌ రావు మాట్లాడుతూ ‘జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే , దాన్ని సాధించడానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుందని’ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా, నటీ నటులు హిమాఖురేషీ, చిత్రాంగధసింగ్‌, ఫ్యాషన్‌ నిపుణుడు ఫాల్గుణి పికోకా, భారత ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కరణ్‌జోహర్‌, నటుడు మనీష్‌పాల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, బాలీవుడ్‌ నటీనటులు కత్రినాకైఫ్‌, విక్కీకౌషల్‌, మౌనీరాయ్‌ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top