రైళ్లు, విమానాల స‌ర్వీసుల‌ను ఆపేయండి : మ‌మ‌తా

Stop Trains Domestic Flights From 5 Worst Hit States - Sakshi

కోల్‌క‌తా : భార‌త‌దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో దేశంలోనే కోవిడ్ ప్ర‌భావం అధికంగా ఉన్న ఢిల్లీ,  మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి దేశీయ విమానాల‌ను న‌డ‌ప‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  పశ్చిమ బెంగాల్‌ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ప్ర‌తీరోజూ ఎక్కువ ‌మొత్తంలో విమానాల‌ను అనుమ‌తించ‌డం ద్వారా క‌రోనా కేసులు మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంద‌ని కాబ‌ట్టి వారానికి  ఒక‌సారి మాత్ర‌మే ఇత‌ర రాష్ర్టాల నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించాల‌ని కోరారు.(ఉద్రిక్తతలు సమసేనా..? )

ఇక కోల్‌క‌తాలో మెట్రో స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించ‌డంపై అనిశ్చితి నెల‌కొంది. ఇంత‌కుముందు మెట్రో, స‌బ‌ర్బ‌న్ స‌ర్వీసుల‌ను ఆగ‌స్టు 12 వ‌ర‌కు నిలిపివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే తాజాగా వైద్యులు,పోలీసులు స‌హ ఇత‌ర ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా ప‌నిచేస్తున్న సిబ్బంది కోసం తిరిగి సేవ‌ల‌ను పునః ప్రారంభించే యోచ‌న‌లో స‌ర్కార్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే వారి ర‌వాణాకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త్వ‌ర‌లోనే రైలు స‌ర్వీసులు ప్రారంభమ‌వుతాయని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. దీనికి అనుగుణంగా అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ‌, హోం శాఖ‌కు  కోల్‌కతా మెట్రో అధికారి లేఖ రాశారు.

జూలై 1 నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం టెలి-మెడిసిన్ సేవ‌ల‌ను ప్రారంభించ‌నుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. దీని ద్వారా ఆసుప‌త్రుల‌కి వెళ్ల‌కుండానే వెద్య స‌హాయం పొందొచ్చ‌ని చెప్పారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువ‌వ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రూ చిన్న చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో హాస్పిట‌ల్‌కి వెళ్ల‌కుండా ఫోన్ ద్వారా నేరుగా వైద్యుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. దీంతో ప్ర‌తి జిల్లాకో ప్ర‌త్యేక టెలిఫోన్ స‌ర్వీసు ఏర్పాటుకానుంది. అంతే కాకుండా దాదాపు 30 మిలియ‌న్ ఫేస్ మాస్కుల‌ను పాఠ‌శాల విద్యార్థుల‌కు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు అందివ్వ‌నున్న‌ట్లు మ‌మ‌తా స్ప‌ష్టం చేశారు.(ఆ నియామకాలపై కరోనా ప్రభావం తక్కువే..)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top