ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష వాయిదా | Staff Selection Commission postpones Combined Graduate Level Examination-2014 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష వాయిదా

Apr 7 2014 2:27 AM | Updated on Aug 20 2018 9:16 PM

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2014ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, మే 4న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది.

న్యూఢిల్లీ: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2014ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, మే 4న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ఎస్‌ఎస్‌సీ  వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ బి, సి పోస్టుల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది.
 
 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మే 16వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల అనంతరం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2013ను ఎస్‌ఎస్‌సీ ఏడు కేంద్రాల్లో తిరిగి నిర్వహించనుంది. గతేడాది లక్నో, పాట్నా, అలహాబాద్, ఢిల్లీ, జైపూర్, సిమ్లా, డెహ్రాడూన్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తిరిగి అక్కడ పరీక్ష నిర్వహించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement