జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం | Spicejet flight collides with animal, passengers safe | Sakshi
Sakshi News home page

జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Dec 4 2015 10:11 PM | Updated on Apr 7 2019 3:28 PM

జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

జెట్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.

భోపాల్: జెట్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్పైస్జెట్ విమానం ఎస్జీ 2458 ల్యాండ్ అవుతుండగా ఓ జంతువు వచ్చి ఢీకొంది. పైలట్ జాగ్రత్తగా ల్యాండ్ చేసినప్పటికీ ముందు భాగం లోని గేర్ ధ్వంసమయింది. ముంబై నుంచి బయలుదేరిన జెట్ విమానం జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. జెట్ విమానంలో 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా 53 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement