రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత | South African woman held with drugs worth Rs 20 crore | Sakshi
Sakshi News home page

రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Jul 20 2015 4:15 PM | Updated on Aug 20 2018 4:27 PM

రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత - Sakshi

రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత

కొచ్చి అంతర్జాతీయ విమనాశ్రయంలో భారీ ఎత్తున మత్తు మందు పట్టుబడింది. సౌతాఫ్రికాకుచెందిన మహిళ వద్దనుంచి సుమారు 14 కిలోల డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

కొచ్చి:   కొచ్చి  అంతర్జాతీయ విమనాశ్రయంలో  భారీ ఎత్తున మత్తు మందు పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ వద్ద నుంచి  సుమారు 14 కిలోల డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. వీటి విలువ 20  కోట్లు ఉంటుందని అధికారులు  తెలిపారు. 

 

కొచ్చి నుంచి దోహా వెళుతుండగా దక్షిణాఫ్రికా మహిళ బ్యాగు తనిఖీ చేసినపుడు 14.580 కేజీల మత్తు మందును  కనుగొన్నామని,  వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు.   మత్తు మందుల అక్రమ రవాణా చేసే డ్రగ్ రాకెట్తో  ఈ మహిళకు ఏమైనా సంబంధాలున్నాయో అనే కోణంలో విచారణ చేపట్టామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement