స్టాలిన్‌కు సోనియా లేఖ | Sonia Gandhi Letter To MK Stalin | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు సోనియా లేఖ

Aug 8 2018 1:50 PM | Updated on Oct 22 2018 9:16 PM

Sonia Gandhi Letter To MK Stalin - Sakshi

కలైంగర్‌ నా తండ్రి లాంటివారు.

న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కలైంగర్‌ నా తండ్రి లాంటివారు. అటువంటి గొప్ప నాయకుడిని ఇక ముందు చూడలేం. దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. తెలివైన నాయకత్వంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటూ..’  కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు సోనియా భావోద్వేగ పూరిత లేఖ రాశారు.

కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement