
'పార్లమెంటులో మాట్లాడతా.. అనుమతించరా..!'
తనకు పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు అనుమతిప్పించాలంటూ ప్రముఖ సామాజివేత్త, స్వామి భూమానంద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
న్యూఢిల్లీ: తనకు పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు అనుమతిప్పించాలంటూ ప్రముఖ సామాజివేత్త, స్వామి భూమానంద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.
పార్లమెంటు చట్టాల ఏర్పాటు ప్రాముఖ్యతతోపాటు, సభా కార్యక్రమాలకు భంగం కలగడం ద్వారా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే అంశాలను ఆయన మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రణబ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు జాతీయ అభివృద్ద ఎజెండాపై కూడా ఆయన ప్రసంగించాలనుకుంటున్నట్లు తెలిపారు.