 
													
పౌర చట్టంపై రిఫరెండం నిర్వహించాలన్న మమతా బెనర్జీ డిమాండ్‌ను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తోసిపుచ్చారు.
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. మమతా వ్యాఖ్యలు భారత పార్లమెంట్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. కోల్‌కతాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర చట్టంపై దీదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్‌ఆర్‌సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రిఫరెండంలో మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుపడితే ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
