‘దేవుడా తీసుకెళ్లు.. నన్ను కాదు నా బరువును’

Smriti Irani Instagram Said Hey Bhagwan Utha Le Mujhe Nahi Mere Vazan Ko - Sakshi

న్యూఢిల్లీ : మనలో చాలా మందిమి ఎదుటి వారిని చూసి కామెంట్‌ చేస్తాం కానీ మన మీద ఎవరైనా జోక్‌ వేస్తే మాత్రం ఊరుకోం. తమ మీద తామే జోకులు వేసుకునే స్పోర్టివ్‌నేస్‌ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ముందుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ రోజు ఉదయం స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటో చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. స్మృతి ఇరానీ తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి ఉన్న ఫోటోనోకదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనిలో స్మృతి ఇరానీ తలమీద ఒక బబుల్‌ ఉంది. దానిలో  ‘భగవాన్‌ తీసుకుపో.. నన్ను కాదు నా బరువును’ అని అనుకుంటున్నట్లు ఉండగా.. స్మృతి భర్త తల మీద ఉన్న బబుల్‌లో ‘ఆమెని కూడా తీసుకుపోతే మంచిది’ అని రాసి ఉంది. ఈ ఫోటోకు స్మృతి ఇరానీ ‘భార్యలు చాలా అద్భుతమైన వ్యక్తులు అని చెప్పే భర్తల అసలు కథ ఇది’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

ఈ ఫోటో స్మృతి ఇరానీ ఫాలోవర్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోను లైక్‌ చేశారు. కొందరు మేడం మీరు చాలా ఫన్ని‌ అని కామెంట్‌ చేయగా.. మరికొందరు నవ్వలేక చచ్చిపోతున్నాను అంటూ కామెంట్‌ చేశారు. దీప్‌వీర్‌ల వెడ్డింగ్‌ సందర్భంగా కూడా స్మృతి ఇలాంటి జోక్‌నే పోస్ట్‌ చేశారు. దీప్‌వీర్‌ల పెళ్లి ఫోటోలు కోసం ఎదురు చూసే వారి పరిస్థితి అంటూ అస్థిపంజరం ఫోటోను పోస్ట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top