మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి! | Six feared dead after fire breaks out at a hotel in Maharashtra’s Gondia | Sakshi
Sakshi News home page

మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి!

Dec 21 2016 1:01 PM | Updated on Sep 5 2018 9:47 PM

మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి! - Sakshi

మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి!

మహారాష్ట్రలోని గోండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

గోండియా: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌లు పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు హోటల్‌లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ప్రమాద స్థలానికి చెరుకున్న అగ్ని మాపక సిబ్బంది 15 ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన హోటల్‌ నుంచి ఓ వ్యక్తి నిచ్చెన సహాయంతో మరో బిల్డింగ్‌ మీదకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement