సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2002 గోద్రా అల్లర్ల సమయంలో ముగ్గురు బ్రిటిష్ జాతీయులను చంపిన హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విచారణ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుద ల చేసింది.
హిమ్మత్‌నగర్(గుజరాత్): సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2002 గోద్రా అల్లర్ల సమయంలో ముగ్గురు బ్రిటిష్ జాతీయులను చంపిన హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విచారణ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుద ల చేసింది. రికార్డులను బట్టి వారు నేరానికి పాల్పడినట్టు సరైన సాక్ష్యాధారాలు లేవని జిల్లా సెషన్స్ జడ్జి ఐసీ షా తీర్పిచ్చారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. గోద్రా రైలు ఘటన జరిగిన మరుసటి రోజు షకీల్, సయీద్, మహ్మద్ అశ్వత్‌లను కొందరు సజీవ దహనం చేశారు.