ఫీజుకోసం అక్కాచెల్లెళ్ల బట్టలూడదీసి తోసేశారు | Sisters Stripped Allegedly By Bihar School | Sakshi
Sakshi News home page

ఫీజుకోసం అక్కాచెల్లెళ్ల బట్టలూడదీసి తోసేశారు

Jun 18 2017 12:23 PM | Updated on Sep 5 2017 1:56 PM

ఫీజుకోసం అక్కాచెల్లెళ్ల బట్టలూడదీసి తోసేశారు

ఫీజుకోసం అక్కాచెల్లెళ్ల బట్టలూడదీసి తోసేశారు

బిహార్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ దారుణం చేసింది. తండ్రి ఫీజు కట్టలేదని కూతుర్లకు అమానవీయ రీతిలో శిక్ష వేసింది. వారిద్దరు దుస్తులు విప్పించి అందరి ముందు నిలబెట్టింది.

పట్నా: బిహార్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ దారుణం చేసింది. తండ్రి ఫీజు కట్టలేదని కూతుర్లకు అమానవీయ రీతిలో శిక్ష వేసింది. వారిద్దరు దుస్తులు విప్పించి అందరి ముందు నిలబెట్టింది. వీధుల్లో నడిపించింది. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపట్ల సభ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చున్‌చున్‌షా అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి మంచి విద్య దొరుకుతుందనే ఆశతో ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చించాడు. వారిద్దరిలో ఒకరు ఒకటో తరగతి చదువుతుండగా మరొకరు నర్సరీ విద్యార్థిని.

అయితే, వారి స్కూల్‌ యూనిఫాం, షూ, స్కూల్‌ ఫీజుల డబ్బులు చెల్లించడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. వారు పలుమార్లు అడిగిన చెల్లించే స్తోమత లేక కాస్త సమయం కోరడంతో కుదరదన్న స్కూల్‌ యాజమాన్యం అమానుష చర్యకు దిగింది. అందరూ చూస్తుండగానే ఆ స్కూల్‌లోని ఓ టీచర్‌ ఆ ఇద్దరు పిల్లల దుస్తులు విప్పించేసి బయటకు తోసేశాడు. ఏడుస్తూ వీధుల వెంట నడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని ఓ వ్యక్తి వారికి వస్త్రాలు ఇచ్చాడు. ఈ ఘటనపై వారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను మరో వ్యక్తిని అరెస్టు చేశారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు కాగా అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చోటు చేసుకుంటుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement