‘సర్జికల్‌ స్ర్టైక్స్‌ మీరే చేపట్టాలి’

Sisodia Calls For Surgical Strike On Unemployment - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, హింసలపై విద్య ద్వారా పోరాడాల్సిన అవసరం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు. ఈ దురాచారాలను నిర్మూలించేందుకు ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారులు వాటిపై మెరుపు దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, ఉపాధ్యాయులు, తనిఖీ అధికారుల శిక్షణా కార్యక్రమంలో సిసోడియా మాట్లాడుతూ చిన్నారుల్లో సంతోషం నింపడం, వారు సమాజంలో ఇతరుల సంతోషానికి కారణం కావడమే విద్య అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.

వార్తాపత్రికల్లో ఎన్నో అంశాలు మనల్ని బాధకు గురిచేస్తాయని, వాటిపై సైన్యం సర్జికల్‌ స్ర్టైక్స్‌ చేయలేదని, మీరే ఆ పనిచేయాలని ఉద్భోదించారు. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కే ఈ దురాచారాలపై ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారలు మెరుపు దాడులు చేయాలని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top