కారు ప్రమాదంలో గాయని మృతి, భర్తకు గాయాలు

Singer Shivani Bhatia Passes Away in Tragic Car Accident Husband Injured - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా (24) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఒక ఫంక్షన్‌ హాజరయ్యేందుకు వెళుతుండగా ఢిల్లీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ప్రమాదంలో శివానీ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.
 
పోలీసులు అందించిన స​మాచారం ప్రకారం భర్త నిఖిల్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో వీరి కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో శివానీ కూర్చున్న వైపు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే శివానీ, నిఖిల్ను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం మధురలోని నియాస్ ఆసుపత్రికి తరలించారు. కానీ  తీవ్రగాయాలతో శివానీ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని పోలీసు అధికారి వీర్‌ సింగ్‌ ప్రకటించారు.  భర్తకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. 

కాగా బీహార్కి చెందిన శివానీ స్థానిక 2016లో టీవీ చానల్‌ నిర్వహించిన పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్వల్పకాలంలోనే  రీమిక్స్‌, పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు.  ఆమె మృతి పట్ల పలువురు  గాయకులు, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top