నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!

Shocking : Man Attempts Suicide by Hanging Self from a Bridge - Sakshi

థానే: మహారాష్ట్రలోని థానేలో భగవాన్‌ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే అతన్ని గమనించిన థానే ట్రాఫిక్‌ పోలీసులు చురుగ్గా స్పందించి.. అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డు మీద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్‌ అని, కొడుకు చనిపోయిన దగ్గరి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top