అఖిలేశ్ మైకు లాక్కున్న శివ్‌పాల్ | Shiv Pal Yadav comments on Mulayam and akhilesh | Sakshi
Sakshi News home page

అఖిలేశ్ మైకు లాక్కున్న శివ్‌పాల్

Oct 25 2016 2:05 AM | Updated on Aug 17 2018 7:32 PM

అఖిలేశ్ మైకు లాక్కున్న శివ్‌పాల్ - Sakshi

అఖిలేశ్ మైకు లాక్కున్న శివ్‌పాల్

అఖిలేశ్, శివ్‌పాల్‌లు వేదికపైనే గట్టిగా అరుచుకున్నారు. ములాయం సింగ్‌తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు నిశ్చేష్టులయ్యారు.

అఖిలేశ్, శివ్‌పాల్‌లు వేదికపైనే గట్టిగా అరుచుకున్నారు. ములాయం సింగ్‌తో పాటు ఇతర  నేతలు, కార్యకర్తలు  నిశ్చేష్టులయ్యారు. గందరగోళం మధ్యే అఖిలేశ్ నుంచి శివ్‌పాల్ మైకు లాక్కుని .. ‘ములాయం చెమటోడ్చి పార్టీని బలోపేతం చేశారు. అంతేగాని మీ నినాదాల వల్ల కాదు’ అని అఖిలేశ్ మద్దతుదారులపై మండిపడ్డారు.

ఈ నాలుగేళ్లలో పార్టీ పటిష్టం కోసం ప్రతి జిల్లాకు మూడు నాలుగు సార్లు తిరిగి కష్టపడ్డానని శివ్‌పాల్ చెప్పగా.. కార్యకర్తల్లో ఒకరు స్పందిస్తూ ‘శివ్‌పాల్ సొంతానికి ప్రభుత్వ హెలికాప్టర్ వాడుకున్నారు’ అని తప్పుపట్టారు. ‘మీ నాన్న సొంత హెలికాప్టరా? నేను మంత్రిని’ అంటూ శివపాల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement