సోనియాపై పోటికి షాజియా ఇల్మిపై ఆప్ దృష్టి! | Shazia Ilmi might contest against Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాపై పోటికి షాజియా ఇల్మిపై ఆప్ దృష్టి!

Feb 17 2014 8:57 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాపై పోటికి షాజియా ఇల్మిపై ఆప్ దృష్టి! - Sakshi

సోనియాపై పోటికి షాజియా ఇల్మిపై ఆప్ దృష్టి!

రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై పోటీకి బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై పోటీకి బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సోనియాపై పోటీకి షాజియా ఇల్మిని ఎన్నికల బరిలోకి దించేందుకు ప్రయత్నాల్ని ప్రారంభించింది. అయితే షాజియా అభ్యర్థిత్వంపై ఆధికారికంగా ఆప్ ప్రతినిధులు ధృవీకరించలేదు. అభ్యర్థుల తుది జాబితాను ఇకా ఫైనలైజ్ చేయలేదు అని ఆప్ అధికార ప్రతినిధి దిలీప్ పాండే తెలిపారు.
 
ఆప్ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సేవలందిస్తున్న షాజియా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆర్కే పురం నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు. దక్షిణా ఢిల్లీ స్థానం నుంచి కాని, కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ పోటీ చేయనున్న ఫరుక్కాబాద్ స్థానం నుంచి పోటీకి షాజియా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
 
ఇప్పటికే ఖుర్షీద్ పై ఆప్ ముఖుల్ త్రిపాఠిని రంగంలోకి దించడంతో రాయ్ బరేలి నుంచి సోనియాపై షాజియాను నిలిపేందుకు ఆప్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఆప్ అభ్యర్థిని అన్వేషిస్తోంది. అయితే  గుజరాత్ లో కాకుండా వేరే స్థానం నుంచి మోడీ పోటీకి దిగితే.. ఏకంగా ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ను అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement