ఆ మాత్రం బంగారానికి హడావిడి అవసరమా..?

Shashi Tharoor Takes A Dig At Sonbhadra Gold Rush - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని సోన్‌భద్రలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయని ప్రభుత్వం ఆర్భాటం చేయడం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ విస్మయం వ్యక్తం చేశారు. ‘తొలుత 5 మిలియన్‌ టన్నుల ఎకానమీ అంటూ డప్పుకొట్టారు..ఆ తర్వాత 3350 టన్నుల బంగారం నిల్వలంటూ ఊదరగొడితే అది కేవలం 160 కేజీలేనని వెల్లడైంద’ని శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలను తోసిపుచ్చిన జీఎస్‌ఐ అక్కడ కేవలం 160 కిలోల బంగారు నిల్వలే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు జీఎస్‌ఐ స్పష్టం చేసింది. కాగా సోన్‌భద్ర జిల్లాలోని సోన్‌ పహాడి, హర్ధి ప్రాంతాల్లో 3250 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను గుర్తించామని జిల్లా మైనింగ్‌ అధికారి కేకే రాయ్‌ శుక్రవారం రాత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి : ఆర్టికల్‌ 370 : పాక్‌ తీరును ఎండగట్టిన శశిథరూర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top