ఆ నేతకు సల్మాన్‌ మూవీలో ఆఫర్‌.. | Shashi Tharoor Revealed That He Was Offered A Role In A Bollywood Movie | Sakshi
Sakshi News home page

ఆ నేతకు సల్మాన్‌ మూవీలో ఆఫర్‌..

Sep 2 2018 9:17 AM | Updated on Apr 3 2019 6:34 PM

Shashi Tharoor Revealed That He Was Offered A Role In A Bollywood Movie - Sakshi

కండలవీరుడితో కనిపించే ఛాన్స్‌..

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మూవీలో తనకు ఓ పాత్రను ఆఫర్‌ చేశారని కాం‍గ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వెల్లడించారు. సోషల్‌ మీడియా స్టార్‌​ జానిస్‌ సీక్వెరాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. సల్మాన్‌ హీరోగా ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో ఓ చిన్న పాత్రను తనకు ఆఫర్‌ చేశారని, ఓ సీన్‌లో భారత విదేశాంగ మంత్రిగా కనిపించాలని కోరారని చెప్పుకొచ్చారు.

తాను ఈ పాత్రను చేసేందుకు ఉత్సాహపడినప్పటికీ ఓ మిత్రుడి సూచనతో వెనక్కితగ్గానన్నారు. నువ్వు విదేశాంగ మంత్రిగా పనిచేయాలని అనుకుంటే ఆ పాత్రను అంగీకరించవద్దని’  స్నేహితుడు సలహా ఇచ్చారన్నారు. కాగా అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు నటించిన అందాజ్‌ అప్నా అప్నాలో తాను కనిపించలేదని శశి థరూర్‌ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తనకు మూవీ ఆఫర్లు రావడం మొదలయ్యాయని, తాను ‍యువకుడిగా, అందంగా ఉన్న సమయంలో ఈ ఆఫర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement