బాలిక ఆత్మహత్య; బయటపడ్డ నిజం | Seven-Year-Old Found Dead In Jodhpur On August 15 Was Raped | Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య; బయటపడ్డ నిజం

Aug 22 2016 11:59 AM | Updated on Jul 28 2018 8:53 PM

బాలిక ఆత్మహత్య; బయటపడ్డ నిజం - Sakshi

బాలిక ఆత్మహత్య; బయటపడ్డ నిజం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏడేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఆమె గురించి భయంకర నిజం తెలిసింది.

జోధ్‌పూర్: స్వాతంత్య్రదినోత్సవం రోజున రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏడేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఆమె గురించి భయంకర నిజం తెలిసింది. ఆత్మహత్యకు ముందు బాలిక అత్యాచారానికి గురైందని తేలింది. బాలిక ఇంట్లోనే నివసించే మైనర్ బాలుడు ఈ నెల 12-15 మధ్య పలుమార్లు ఈ ఆకృత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాప మూడో తరగతి చదువుతోంది. బిహార్‌కు చెందిన వీరి కుటుంబాలు జోధ్‌పూర్‌లోని బాస్ని ప్రాంతంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాయి. ఆగస్టు 15న స్కూలు నుంచి తిరిగొచ్చాక బాలిక ఉరివేసుకుంది. స్కూల్లో తిట్టినందుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని మొదట భావించారు. అయితే పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం తెలిసింది.

'పోస్టుమార్టం నివేదిక అందింది. బాలిక అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి షాక్ గురయ్యామ'ని దర్యాప్తు అధికారి రాజేశ్ యాదవ్ అన్నారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement