జనావాసాల్లోకి ఏడు సింహాలు

Seven lions walk into Junagarh city - Sakshi

గిరినగర్‌: గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జునాగఢ్‌లోని గిరినగర్‌ వీధుల్లో గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. దీన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకి తోలారు. కాగా, ఈ విషయమై జునాగఢ్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌(డీసీఎఫ్‌) ఎస్కే బేర్వాల్‌ మాట్లాడుతూ.. గిర్‌ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని తెలిపారు. వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు. ఈ సింహాలన్నీ క్షేమంగానే ఉన్నాయని తేల్చిచెప్పారు. 2015 నాటి లెక్కల ప్రకారం గిర్‌ అభయారణ్యంలో 523 ఆసియా సింహాలు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top