పాలు పాడైతే పసిగట్టే సెన్సార్‌

Sensor to Catch Milk that is Damaged - Sakshi

వాషింగ్టన్‌: పాలు పాడైపోయిన విషయాన్ని పసిగట్టే సెన్సార్‌ను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ సెన్సర్‌ రాకతో మనం పాల ప్యాకెట్లమీద ఎక్స్‌పైరీ డేట్లు చూసుకోవడమనేది గతంగా మిగిలిపోనుంది. పాలలో బ్యాక్టీరియా పెరిగితే పాలలోంచి వచ్చే వాయువులను ఈ సెన్సర్లపై రసాయనాల పూతతో ఉండే సూక్ష్మ అణువులు పసిగడతాయని వర్సిటీ ప్రొఫెసర్‌ శ్యామ్‌ సబ్లానీ తెలిపారు. ఈ సెన్సర్‌ పాలను నేరుగా తాకకుండానే అవి పాడైనవో కావో చెబుతుంది. ఏవైనా ఆహారపదార్థాలు పాడైతే అందులో బ్యాక్టీరియా పెరిగి వాటినుంచి చెడు వాసన వస్తుంది. కంటైనర్‌ ఓపెన్‌చేస్తేగానీ మనకా విషయం తెలీదు. కానీ ఈ సెన్సర్‌ మారిన ఆహారం రంగును, వెలువడే వాయువులను గుర్తించి వాటి వినియోగస్థితిని చెప్తుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top